తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందు ఉంటుంది అని చెప్పడంలోో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు ఇప్పుడు మరో కొత్త బాధ్యత పెరిగింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. నిన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నిర్మాత సి.కళ్యాణ్ ఇంకా దిల్ రాజు పోటీకి నిలిచారు. ఇక ఈ ఎన్నికల్లో దిల్ రాజు విజయం సాధించారు. సి.కల్యాణ్ పై విజయం సాధించారు. దిల్ రాజు 31 ఓట్లతో గెలుపొందారు. దిల్ రాజు ప్యానల్ నుండి తెలుగు ఫిలిం చాంబర్ ,ప్రెసిడెంట్ గా దిల్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్, ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఇది పాలిటిక్స్ ఎలక్షన్ కాదు.. సినిమా అనేది వ్యాపారం. రేపటి నుండి మేము అందరం కలసి పని చేస్తాం.. ఈరోజు నుంచి ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య లు పరిష్కారం కోసం కలసి పని చేస్తాం అందరికి ధన్యవాదాలు అంటూ తెలిపారు.
కాగా డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంటుంది. సక్సెస్ ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉంటారా అన్నట్టు తను నిర్మించే సినిమాల్లో చాలా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంటాయి. ఇక్కడ మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీలో కూడా దిల్ రాజు తన మార్క్ ను చూపించడానికి చూస్తున్నాడు. బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలను లైన్ లో పెట్టిన దిల్ రాజు తమిళ్ లో కూడా శంకర్ లాంటి డైరెక్టర్ తో ప్లాన్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దీనితో పాటు చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే దిశగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి మొదటిసినిమా బలగం తోనే అంతర్జాతీయంగా హిట్ తెచ్చుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: