నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

nithiins extra ordinary man movie first single release date fixed

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా అందులో వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఔట్ అండ్ ఔట్ యక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో నితిన్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది ఈసినిమా. ఇక ఇన్ని రోజులు నితిన్ 32 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకోగా రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు ఎక్స్‌ట్రా అనే టైటిల్ ను పెట్టగా ఆర్డిన‌రీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్ ఇచ్చారు. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు డేంజర్ పిల్ల అనే పాటను ఆగష్ట్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23వ తేదీన ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =