యంగ్ హీరో విశ్వక్ సేన్,డైరెక్టర్ కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ మరియు గ్లింప్స్ ను కొద్దిసేపటి క్రితం విడుదలచేశారు.ఈసినిమాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ ఏ కాదు గ్లింప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.గోదావరి జిల్లాల్లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో విశ్వక్ సేన్ ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్,గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈడిసెంబర్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రేక్షకులముందు రానుంది.
ఈసినిమా తోపాటు విశ్వక్ సేన్ ప్రస్తుతం మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను రవి తాళ్లూరి నిర్మిస్తున్నాడు.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.ఈసినిమా టైటిల్ మరియు గ్లింప్స్ వచ్చే నెల 6న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: