మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు ‘చిరు లీక్స్’ పేరుతో తన సినిమాలకు సంబంధించిన కొన్ని సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తన రాబోయే చిత్రం ‘భోళా శంకర్’ గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని లీక్ చేశారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని అనుకరించడం విశేషం. అందులో చిరంజీవి ‘తమ్ముడి పాట వస్తుందిలే’ అంటూ పవన్ ‘ఖుషి’ సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ ‘యే మేరా జహా’ పాటను, అందులో పవన్ మేనరిజాన్ని అనుకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మెగాస్టార్ ఆ వీడియోలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నాకు, నా డైలాగులకు, నా పాటలకు డ్యాన్స్ చేసేవాడని, ఇప్పుడు అందరినీ అలరించేందుకు భోళా శంకర్‌లో పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్‌ని తాను అనుకరిస్తున్నానని చెప్పారు. ఇక ప్రేక్షకులు థియేటర్లలో దీనిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని కూడా మెగాస్టార్ అన్నారు. కాగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రం వచ్చే నెల 11న ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున విడుదల కానుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: