సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన చురుకైన నటనతో అప్పట్లోనే ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తండ్రికి తగ్గ వారుసులుగా తయారవుతున్నారు సితార, గౌతమ్. వీరిద్దరిలో గౌతమ్ కాస్త సైలెంట్ కాగా సితార మాత్రం హైపర్ యాక్టివ్. అందుకే చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ సైతం అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి వారసులు సినీ ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్.. అయితే కొంతంమంది మాత్రం వేరే ఫీల్డ్ లను ఎంచుకుంటారు. ఈనేపథ్యంలోనే మహేష్ వారసులు కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చాలా గాలంగా సస్పెన్స్ లో ఉన్న విషయం. అయితే ఇప్పుడు ఈవిషయంలో పుల్ క్లారిటీ వచ్చేసింది. సితార పీఎంజే జ్యూయెలరీ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో సితార, నమ్రత, పీఎంజే జ్యూయెలరీ సంస్థ అధినేత పాల్గొన్నారు. ఈసందర్భంగా వీరి సినీ ఎంట్రీ గురించి అడుగగా.. దానికి సితార మాత్రం ఫిలిం ఇండస్ట్రీలో తన కెరీర్ ను మలుచుకునేందుకు చాాలా ఇంట్రెస్ట్ గా ఉన్నానని తెలిపింది. ఇక గౌతమ్ గురించి నమ్రతా చెబుతూ.. గౌతమ్ కి ఇంకా 16ఏళ్లు… సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.. ప్రస్తుతం తను తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. 7-8 ఏళ్ల తరువాత తను ఎంట్రీ ఇవ్వచ్చు అని స్పష్టం చేశారు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.
That’s a SUPER UPDATE from the Ghattamaneni clan!!🔥
Super 🌟 @urstrulyMahesh kids #GautamGhattamaneni & #SitaraGhattamaneni are likely to make their way into the film industry!!✌️#MaheshBabu #NamrataShirodkar #TeluguFilmNagar pic.twitter.com/LLNbrgOf3s— Telugu FilmNagar (@telugufilmnagar) July 15, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: