బేబి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి రౌడీ హీరో

vijay devarakonda will be chief guest for baby movie success

ఎలాంటి అంచనాాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్న సినిమాలు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమా యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ , వైష్ణవి ల నటన, కథ, సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి జనరేషన్ లో లవ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూపించారు. దీంతో సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. మొదటిరోజే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు రెండు రోజుల్లో ఈసినిమా 14 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాట్టుకుంది. ప్రస్తుతం అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ ఫుల్ హ్యాపీలో ఉంది. ఈనేపథ్యంలో నేడు సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకోనున్నారు. కల్ట్ బ్లాక్ బస్టర్ పేరుతో జరపనున్న ఈ సెలబ్రేషన్స్ హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనున్నాయి. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిథిగా రానున్నాడు.

కాగా ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.