ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మాయా పేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈసినిమాను రూపొందించగా ఈసినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంది. ఇక మంచి ఎక్స్ పెక్టేషన్స్ తో ఈసినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈసినిమా ఎలాా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృధ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు
దర్శకత్వం..రమేష్ రాపర్తి
బ్యానర్..జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్
నిర్మాతలు.. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి
సంగీతం.. గుణ బాలసుబ్రమణియన్
సినిమాటోగ్రఫి..సురేష్ రగుతు
కథ..
ఒకే ఒక్క సెల్ ఫోన్ పలువురి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అనేది ఈసినిమా వృత్తాంతం మొత్తం. కథ విషయానికి వస్తే.. పాయల్ (పాయల్ రాజ్ పుత్) ఓ హీరోయిన్. ఇక తనకు తన నిర్మాత ఓ సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. అయితే ఆమె ప్రియుడు ప్రణయ్(రజత్ రాఘవ్)కు మాత్రం అది నచ్చదు. ఆ ఫోన్ కారణంగా వారిద్దరి మధ్యా విభేదాలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత ఆ ఫోన్ ను తన అసిస్టెంట్ కు ఇస్తుంది. ఇక అసిస్టెంట్ దగ్గర నుండి మరో వ్యక్తి దగ్గరికి ఇలా పలువురు చేతిలోకి ఆ ఫోన్ వెళుతుంది. ఆ ఫోన్ తో వారి జీవితాలు ఏమయ్యాయి? అసలు ఆ ఫోన్ కథ ఏంటి..?అన్నదే ఈసినిమా కథ.
మాయా పేటిక అంటే ఏదో మ్యాజిక్ లు మాయలు, మంత్రాలు, తంత్రాలు ఉంటాయి అనుకోవడం పొరపాటే. ఇది సెల్ ఫోన్ నేపథ్యంలో తీసిన కథ. ఈమధ్య కాలంలో సెల్ ఫోన్ అనేది మనిషి జీవితంలో భాగస్వామ్యమైపోయింది. ఒక మనిషి వ్యక్తిత్వం పూర్తిగా తెలియాలంటే సెల్ ఫోన్ ఒక్కటి చూస్తే చాలు అన్నంత పరిస్థితి వరకూ వచ్చింది. ఇక ఈ సెల్ ఫోన్ నేపథ్యంగా తీసుకొని వచ్చిన సినిమా మాయాపేటిక. సెల్ ఫోన్ వల్ల మంచి, చెడూ రెండూ ఉంటాయని.. దానిని మనం ఎలా వాడుకుంటున్నాము అనే దానిపై ఉంటుందన్నది చాలా బాగా చూపించాడు డైరెక్టర్ రమేష్ రాపర్తి.
ఇక ఒక టికెట్ తో ఆరు షోలు అన్నట్టు.. ఈసినిమా ద్వారా ఆరు కథలను చూపించాడు డైరెక్టర్. పాయల్ రాజ్ పుత్ ఫోన్ దగ్గర మొదలవుతుంది ఈ కథ. ఆ తరువాత ఫోన్ వల్ల కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు (పృథ్వీరాజ్) ఎలా జైలుకు వెళ్లారు? అలీ (విరాజ్ అశ్విన్), ఆస్రా (సిమ్రత్ కౌర్) మధ్య ప్రేమ ఎలా పుట్టింది. వాచ్‌మెన్, అతని భార్య సోషల్ మీడియాలో ‘నక్కిలీసు గొలుసు’ నారాయణ రావు (సునీల్)గా ఎలా ఫేమస్ అయ్యారు? కోతిని ఆడించే శ్రీనివాసరెడ్డి జీవితంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? అనే కథలను పార్లల్ చూపిస్తూ కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఇక నటీనటులు విషయానికి వస్తే.. పాయల్ రాజ్ పుత్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ఇక పృథ్వీ రాజ్ అయితే తన మీద తానే సెటైర్లు వేసుకునే పాత్రలో నటించి బాగా నవ్వించాడు. నక్కిలీసు గొలుసు నారాయణగా సునీల్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. అతనికి జోడీగా శ్యామల కూడా బాగా చేసింది. శ్రీనివాసరెడ్డి పాత్ర కూడా ఆలోచింపజేస్తుంది. విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ లవ్ స్టోరీ బాగుంది. ఇక మిగిలిన వారు తమపాత్రల మేర నటించారు.
సాంకేతిక విభాగానికి వస్తే పాటల సంగతి పక్కనపెడితే గుణ బాలసుబ్రమణియన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మాయా పేటిక మెసేజ్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: