పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ఆ తరవాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఈమధ్య కాలంలో వచ్చిన అర్జున ఫల్గుణ, భళా తందనాన, అల్లూరి వంటి సినిమాలు రిలీజ్ చేయగా అవి అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సామజవరగమన సినిమాను రిలీజ్ చేశాడు. ఈసినిమా నిన్న అంటే జూన్ 29 వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అంతేకాదు పాజిటివ్ టాక్ తో పాటు ఫుల్ ఎంటర్టైనర్ అనే టాక్ వస్తుండటంతో ఈసినిమాకు ఆదరణ మరింత పెరుగుతుంది. ఇక ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఫస్ట్ డే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 2.89 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The FUNtastic Blockbuster is off to a FANTASTIC START 🥳#Samajavaragamana Grosses 2.89CR worldwide on DAY 1 with all your LOVE & LAUGHS 🤩
🎟️ https://t.co/Y61eSHAxm3@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @HasyaMovies pic.twitter.com/D9cZ1UZwNE
— AK Entertainments (@AKentsOfficial) June 30, 2023
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: