బ్రో ఫస్ట్ సింగిల్ అప్ డేట్

pawan kalyans bro movie first single update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ అందరూ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి టీజర్ ను నిన్ననే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ కు ఏ రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ స్టైల్, ఎనర్జిటిక్ యాక్టింగ్, తేజ్-పవన్ కెమిస్ట్రీ, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవడంతో టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టనున్నారు. ఈనేపథ్యంలోనే థమన్ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు. జులై 3వ తేదీ నుండి ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుకానున్నాయని.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ అధికారికంగా తెలుపనుందని ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =