నటీనటులు : శ్రీ విష్ణు,రెబా మౌనికా జాన్ ,నరేష్,వెన్నెల కిషోర్
ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డి
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : రామ్ అబ్బరాజు
నిర్మాత : రాజేష్ దండా
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పక్కింటి అబ్బాయి పాత్రలో కనబడి మెప్పించే నటుల్లో శ్రీవిష్ణు ఒకరు.కామెడీ సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.బ్రోచేవారెవరురా,రాజ రాజ చోర లతో సూపర్ హిట్లు కొట్టాడు.ఇక ఇప్పుడు శ్రీ విష్ణు మరోసారి అదే జోనర్ లో చేసిన సినిమా సామజవరగమన.సినిమా మీద నమ్మకమంతో రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు.ఆషో ల నుండి పాజిటివ్ రివ్యూస్ రావడంతో సినిమాకు హైప్ వచ్చింది.ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
బాలు (శ్రీవిష్ణు) మిడిల్ క్లాస్ అబ్బాయ్.మల్టీ ఫ్లెక్స్ లో పనిచేస్తూ తన తండ్రి నరేష్ ను ఎలాగైనా డిగ్రీ లో పాస్ చేయించాలనే ప్రయత్నం చేస్తుంటాడు.దానికి కారణం తన తండ్రి చేతికి డిగ్రీ పట్టా వస్తేనే తాత ఆస్తి చేతికి వస్తుంది.ఈక్రమంలో సహాయం చేయడానికి సరయు (రెబా మౌనికా జాన్ )బాలు ఇంటికి వస్తుంది.కానీ ఈసారి కూడా బాలు కలనెరవేరదు.ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగా సరయు,బాలును ఇష్ట పడుతుంది కానీ బాలు కి ప్రేమ మీద ఆసక్తి ఉండదు.అయితే చాలా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సరయు,బాలుని ప్రేమలోకి దింపుతుంది.ఇక అంత సెట్ అనుకున్న క్రమంలో సరయు గురించి బాలు కి ఓ నిజం తెలుస్తుంది.ఇంతకీ ఆ నిజంఏంటి ? చివరికి సరయు,బాలు ప్రేమకథా ఏమైంది అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
కథ అంత గొప్పగా లేకపోయినా రెండు గంటలకు పైగా థియేటర్లలో కూర్చో బెట్టి ప్రేక్షకులను నవ్వించవచ్చు అని సామజవరగమన నిరూపించింది. ఇందుకు డైరెక్టర్ ను అభినందించాల్సిందే.తన రైటింగ్ స్కిల్స్ తో చాలా చోట్ల నవ్వు తెప్పించాడు. ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్ గా సాగింది.శ్రీ విష్ణు,నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా వున్నాయ్.నరేష్ ను ఎలాగైనా పాస్ చేయించడానికి శ్రీ విష్ణు పడిన తాపత్రయం అందులో భాగంగా వచ్చే సన్నివేశాలు బాగున్నాయి .ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ఎక్కడా బోర్ కొట్టదు.సినిమా స్లో అవుతున్న టైం లో వెన్నెల కిశోర్ పాత్రను ప్రవేశపెట్టి ఫన్ జనరేట్ చేయించాడు దర్శకుడు.
శ్రీవిష్ణు,నరేష్,వెన్నెల కిషోర్,సుదర్శన్ పాత్రలు సినిమాలో హైలైట్ అయ్యాయి.వీరందరూ కలిసి సామజవరగమన ను హిలేరియస్ గా మార్చారు.సినిమాలో ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేకుండా క్లీన్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించడంలో డైరెక్ట్ సక్సెస్ అయ్యాడు.ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదని చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే తనకు అలవాటైన పాత్రలో శ్రీ విష్ణు చెలరేగిపోయాడు.తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు.ఆయనకు తోడు నరేష్ కూడా తన విశ్వరూపం చూపించాడు.సరయు పాత్రలో హీరోయిన్ రెబా మౌనికా జాన్ హుషారుగా కనిపించింది.వెన్నెల కిషోర్,సుదర్శన్ పాత్రలు సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి.మిగితా పాత్రల్లో నటించిన నటీనటులు పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ గా కంటే రైటర్ గా ఎక్కవగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు. రైటింగ్ సినిమాను నిలబెట్టింది.రెండు గంటలకు పైగా థియేటర్లలో కూర్చోబెట్టి ఎంటర్టైనర్ చేయించడం మాములు విషయం కాదు.ఈవిషయంలో ఎక్కడా నిరాశపరచలేదు.సంగీతం డీసెంట్ గా వుంది.గుర్తుపెట్టుకొనే సాంగ్స్ అయితే లేవు.ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ ఓకే.సినిమాకు తగ్గట్లు ఖర్చు చేశారు నిర్మాత.
ఓవరాల్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఇది.ఈవిషయంలో సామజవరగమన ఎక్కడా నిరాశపరచదు.క్లీన్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే ఫ్రెండ్స్,ఫ్యామిలీతో కలిసి ఈసినిమాకు వెళ్లొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: