వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు యంగ్ హీరో నిఖిల్. కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాల బ్లాక్ బస్టర్లు తరువాత నిఖిల్ నుండి వస్తున్న సినిమా స్పై. ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. నిఖిల్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నిఖిల్, ఐశ్వర్య మీనన్, రానా, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం,సన్యా ఠాకూర్ తదితరులు
దర్శకత్వం.. గ్యారీ బి.హెచ్
బ్యానర్.. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్
నిర్మాత : కె. రాజశేఖర్ రెడ్డి
సంగీతం..శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫి..వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
కథ..
విజయ్ అలియాస్ జయ్ (నిఖిల్ సిద్దార్థ్) రా ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. జయ్ సోదరుడు సుభాష్ (ఆర్యన్ రాజేష్) రా ఏజెంట్‌గా పనిచేస్తూ శత్రువుల చేతిలో మరణిస్తాడు. మరో వైపు భారత్‌లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఖాదర్ ప్లాన్స్ విచ్ఛిన్నం చేయడానికి జయ్ తన టీమ్ కమల్ (అభినవ్ గోమటం) వైష్ణవి (ఐశ్వర్య మీనన్)తో కలిసి జోర్డాన్‌కు వెళ్తాడు. అక్కడ తన అన్నయ్య మరణానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు జయ్ కి తెలుస్తాయి. ఆ సమయంలో జయ్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? తన సోదరుడు మరణం వెనుక కారణాలను తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? నేతాజీ ఫైల్స్‌కి ఈ సినిమా కథకు సంబంధం ఏమిటి? చనిపోయాడనుకొన్న ఖాదర్ ఎలా బతికి వచ్చాడు? అనేదే ఈసినిమా కథ..
విశ్లేషణ..
స్పై సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే అయినప్పటికీ మేకింగ్, కథ కొత్తగా ఉంటే వాటికి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు నిఖిల్ హీరోగా వస్తున్న స్పై సినిమాకులో కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చరిత్రలో కొన్ని మిస్టరీలు ఎప్పుడూ అలానే ఉంటాయి. ఏం జరిగింది? ఎలా జరిగింది అనే విషయాలకు ఎప్పుడూ సమాధానాలు దొరకవు. అలాంటి మిస్టరీల్లో స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం కూడా ఒకటి. అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారుచేసి, వారిలో యుద్ధ స్ఫూర్తిని నింపిన నేత సుభాష్ చంద్రబోస్. యుద్ధ సమయంలో విమాన ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆతరువాత సుభాస్ చంద్రబోస్ మరణం అనేది మిస్టరీగానే మారింది. ఆమధ్య సుభాష్ చంద్రబోస్ అక్కడ ఉన్నాడు.. ఇక్కడ ఉన్నాడు.. ఇంకా బ్రతికే ఉన్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. అవి కూడా వార్తలుగా మిగిలిపోయాయి.
అయితే ఇప్పుడు ఆమిస్టరీ నేపథ్యంలోనే మొదటిసారిగా సినిమా రావడం విశేషం. నేతాజీ మరణం మిస్టరీ వెనుక దాగి ఉన్న అనేక రహస్యాలను పరిశోధన చేసి రాసుకున్న కధే ఈ ‘స్పై. ఈ ఒక్కపాయింట్ తోనే స్పై టీమ్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. స్పై థ్రిల్లర్ కు బ్రదర్ సెంటిమెంట్ ను జోడించి ఈసినిమాను ఫ్యామిలీ ప్రేక్షకులనకు కూడా కనెక్ట్ అయ్యేలా తీశాడు గ్యారీ. పలు సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ దర్శకుడిగా ఈ సినిమాని అంతే థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.
దర్శకుడిగా తన మొదటి చిత్రమైనప్పటికీ.. బాధ్యతతో హ్యాండిల్ చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ఇన్వాల్వ్ అయ్యుండడంతో.. ఈ సినిమాపై నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఛేజింగ్ సీక్వెన్స్ లు, క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం ఆడియన్స్ ను అలరిస్తుంది.
పెర్ఫామెన్స్..
ఈమధ్య కాలంలో నిఖిల్ కూడా తన రూట్ మార్చాడు. కాస్త డిఫరెంట్ గా కథలను ఎంచుకుంటున్నాడు. అందుకే వరుసగా విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఈసినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. తన స్టైలిష్ లుక్, యాక్షన్స్ తో అదరగొట్టాడు. నిజం చెప్పాలంటే నిఖిల్ ది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్ర కూడా బాగుంది .ఆమెకి మంచి పాత్ర దక్కిందని చెప్పవచ్చు. విలన్ పాత్రలో నటించిన నితిన్ మెహతా విలన్ గా బాగా చేశాడు. ఆర్యన్ రాజేష్ కూడా చాలా గ్యాప్ తరువాత ఎంట్రీ ఇచ్చి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రానా ఎప్పీయరెన్స్ స్పెషల్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఫుల్ లెంగ్త్ రోల్ లో చేసిన అభినవ్ గోమటం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్..
స్పై సినిమాలకు ముఖ్యంగా కావాల్సింది టెక్నికల్ వాల్యూస్. సాంకేతిక విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈసినిమాకు కూడా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా సెట్ అయ్యాయి. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొంత బలంగా మారాయి. వంశీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఇక ఈసినిమాకు మ్యూజిక్ ప్లాస్ అయ్యిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇలాంటి సినిమాలకు పాటలు ఉంటేనే చాాలా డిస్టర్బ్ గా ఫీలవుతారు ఆడియన్స్. అందుకే పాటలు ఎక్కువ లేకుండా చూసుకున్నారు.
ఓవరాల్ గా చెప్పాలంటే స్పై సినిమాలను, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా నచ్చేస్తుంది. మిగిలిన వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: