పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ దేశవ్యాప్తంగా తన సత్తాను చాటుతున్నాడు. తనకున్నఇమేజ్ తోనే నిర్మాతలు సైతం భారీ స్థాయిలో బడ్జెట్ లు కేటాయించి సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. ఇక సినిమా రిజల్డ్ తో పని లేకుండా ప్రభాస్ కటౌట్ తోనే సినిమాకు కలెక్షన్స్ తెచ్చిపెడుతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమానే దీనికి కారణం. ఈసినిమా రిలీజ్ తర్వాత మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. దానికి తోడు పలు వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అయినా ఈసినిమా ఇప్పటికే 450 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక రిలీజ్ కావాల్సిన సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తరువాత రిలీజ్ కాబోయే సినిమాల్లో మోస్ట్ ఇంట్రెస్టెడ్ సినిమా ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున ఈసినిమా ఎలా ఉండబోతుందో ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈసినిమాపై ఇప్పటికే అంచనాలు ఓరేంజ్ లో ఉండగా తాజాగా ఈసినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరాయి. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా మన దేశ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధిస్తుందని… తొలిరోజే రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందని అంచనా వేశారు. అయితే అది ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ చేసే ప్రచార కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుందని.. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. మరి చూద్దాం తమ్మారెడ్డి భరద్వాజ జోస్యం ఎంతవరకూ ఫలిస్తుందో.
కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: