రివ్యూ : అశ్విన్స్  

asvins telugu movie review
నటీనటులు : వసంత్ రవి,విమలా రామన్,మురళీధరన్ ,సారస్ మీనన్
ఎడిటింగ్ : వెంకట్ రాజన్
సినిమాటోగ్రఫీ :ఎడ్విన్ సాకే
సంగీతం : విజయ్ సిద్దార్థ్
దర్శకత్వం :తరుణ్ తేజ
నిర్మాత :బివిఎస్ఎన్ ప్రసాద్
 
తమిళ నటుడు వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అశ్విన్స్.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాఫై ఇంట్రెస్ట్ ను తీసుకొచ్చింది.తమిళ,తెలుగు భాషలో విడుదలైన ఈసినిమా ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.మరి అశ్విన్స్ ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూ ట్యూబర్స్ అయిన అర్జున్ (వసంత్ రవి),రీతూ ( సారస్ మీనన్ ),రాహుల్ (ఉదయ్ దీప్ ) గ్రేస్ ( మలినా అతుల్),వరుణ్ (మురళీధరన్) దెయ్యాలున్నాయని జనాలు వెళ్లని బంగ్లాలకు వెళ్లి వీడియోస్ చేస్తుంటారు.ఈ క్రమంలో ఆ ఐదుగురు లండన్ లోని దెయ్యాలు తిరుగుతున్నాయి అన్న ఓ బంగ్లా కు వెళ్లి షూటింగ్ చేయాల్సివస్తుంది.అందులో ఒకప్పుడు ఆర్కియాలిజిస్టు ఆర్తి రాజగోపాల్ (విమల్ రామన్ ) నివాసం ఉండేది.అందులో 15మంది శవాలు దొరుకుతాయి అలాగే ఆర్తి రాజగోపాల్ శవం కూడా మాయమవుతుంది.ఇంతకీ ఆ బంగ్లా లో ఏముంది? ఇంతకుముందు ఆ బంగ్లా లోకి వెళ్లిన వారు చనిపోవడానికి కారణం ఏంటి ? ఇంతకీ ఆ 5గురు యూ ట్యూబర్స్ లోపలికి వెళ్లి మళ్ళీ ప్రాణాలతో బయటికి వచ్చారా లేదా అనేది మిగితా కథ.

విశ్లేషణ :

ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. దానికి తగ్గట్లుగానే సినిమా… ట్విస్టులు,హారర్ సన్నివేశాలతో భయపెట్టి  థ్రిల్ చేస్తుంది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కథ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించలేదు దర్శకుడు.చాలా సన్నివేశాలు చాలా ఎంగేజింగ్ గా ఉండి థ్రిల్ చేస్తాయి.ముఖ్యంగా సౌండ్ మిక్సింగ్ అదిరింది.ఇక సెకండ్ హాఫ్ లో రెగ్యులర్ హారర్ సన్నివేశాలు వున్నా కూడా ఎక్కడా నిరాశపరచదు.తరువాతి సీన్ లో ఏమైతుందో అని ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.ఈ హారర్ థ్రిల్లర్ కి సినిమాటోగ్రఫీ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోశాయి.సినిమాలో చాలా థ్రిల్ మూమెంట్స్ వున్నాయి.హారర్ జోనర్ ను ఇష్టపడే వారికీ ఈసినిమా విపరీతంగా నచ్చుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే  హీరోగా నటించిన వసంత్ రవి చాలా బాగా చేశాడు.క్లైమ్యాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన హైలెట్ అయ్యింది.సినిమాలో ఈ పాత్ర తరువాత విమల్ రామన్ పాత్ర కూడా బాగుంది. అందులో ఆమె చాలా బాగా నటించింది.మిగితా పాత్రలు అంత బలంగా లేకపోయినా ఆ పాత్రల్లో నటించిన నటీనటులు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఇక టెక్నీకల్ డిపార్ట్మెంట్ విషయాన్ని వస్తే దర్శకుడికి ఇదే మొదటి సినిమా అయినా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు.డైలాగ్స్,విజువల్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు.ఇలాంటి తరహా సినిమాలు ఇంతకుముందు వచ్చినా కూడా అశ్విన్స్ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.సినిమాటోగ్రఫీ,నేపథ్య సంగీతం సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యాయి.ఈరెండు విభాగాలు సినిమాను నిలబెట్టాయి.ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా సైకాలిజికల్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాను ఈఏడాది వచ్చిన హారర్ థ్రిల్లర్స్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ గా చెప్పొచ్చు. డైరెక్షన్ కి తోడు సినిమాటోగ్రఫీ,నేపథ్య సంగీతం సినిమాలో హైలైట్స్ అయ్యాయి. ఈసినిమా భయపెట్టి, థ్రిల్ చేస్తుంది. హారర్ జోనర్ ను ఇష్ట పడే వారికీ అశ్విన్స్ విపరీతంగా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =