ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా కోడూరి హీరోగా వస్తున్న సినిమా భాగ్ సాలే. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే ఈసినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. రీసెంట్ గానే రిలీజ్ డేడ్ ను కూడా ప్రకటించారు. జులై 7వ తేదీన ఈసినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డు ఈ సినిమా ప్రధాన మూలానికి గల కారణం ఏంటో ఒక స్టోరీ ద్వారా తెలియచేశాడు. సిద్దూ స్టోరీ నరేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: