పవన్ కళ్యాణ్,సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజి. రీసెంట్ గా స్టార్ట్ అయినా ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది.ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.పవన్ ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండగా ఆయనకు జంటగా ప్రియాంక మోహన్ నటిస్తుంది.ఇక ఈసినిమాలో శ్రీయ రెడ్డి ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.ఈసినిమా గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సుజిత్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇది ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయ్యింటుంది అనుకోని నో చెప్పేదాం అనుకున్నా కానీ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాక 5 నిమిషాల్లోనే ఓకే చెప్పాను.కంటెంట్ తోపాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడనే కారణాలతోనే సినిమాలో నటించడానికి అంగీకరించా అంటూ చెప్పుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శ్రీయా రెడ్డి ఈసినిమాతోపాటు ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సలార్ లో కీలక పాత్రలో కనిపించనుంది.రీసెంట్ గా శ్రీయ రెడ్డి ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది.పాన్ ఇండియా మూవీ గా వస్తున్న సలార్ సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: