హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 వస్తుంది. ఈసీక్వెల్ లో రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉండగా.. ఇప్పుడు ఈసినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
కాగా కాగా ఈసినిమాలో కంగనా రనౌత్, వడివేలు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మరి సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: