సిద్దార్ధ్ టక్కర్ రివ్యూ

siddharth takkar movie review

కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘టక్కర్’. ఈసినిమా టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంది. ఇక ఈసినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. సిద్దార్ధ్ కు మంచి కమ్ బ్యాక్ ఫిలిం అయిందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు తదితరులు
దర్శకత్వం.. కార్తిక్ జి క్రిష్
బ్యానర్స్.. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌
నిర్మాతలు.. సుధన్ సుందరం, జయరాం
సినిమాటోగ్ర‌ఫీ.. వాంజినాథ‌న్ మురుగేశ‌న్
సంగీతం.. నివాస్ కె ప్రసన్న

కథ

గుణ (సిద్దార్థ్‌) మధ్య తరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. తనకున్న ఆర్థిక సమస్యలవల్ల ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో ఉంటాడు. దానితో కారు డ్రైవర్ గా లైఫ్ స్టార్ట్ చేస్తాడు. మరోవైపు ల‌క్కీ (దివ్యాంశ కౌశిక్‌) కోటీశ్వ‌రుడి కూతురు. అయితే తనకు డబ్బు ఉన్నా కానీ హ్యాపీనెస్ ఉండదు. దానికితోడు తండ్రి బ‌ల‌వంతంగా త‌న‌కో సంబంధం ఫిక్స్ చేస్తాడు. ఆ పెళ్లి ల‌క్కీకి ఇష్టం లేదు. మరోవైపు రాజ్ (అభిమన్యు సింగ్) ది కిడ్నాప్ వ్యాపారం. అమ్మాయిలను కిడ్నాప్ చేయటం …డబ్బు ఇచ్చి వాళ్ల వాళ్లు తీసుకెళ్లకపోతే విదేశాలకు అమ్మేయటం చేస్తూంటాడు. ఈనేపథ్యంలో లక్కీని కిడ్నప్ చేస్తారు. ఈక్రమంలో కిడ్నాపర్స్ కి గుణకి అనుకోకుండా గొడవ జరుగుతుంది. దానికిగాను వాళ్ల కారు ఎత్తుకొస్తాడు గుణ. ఆ కారు డిక్కీలో లక్కీ ఉంటుంది. మరి లక్కీ ని చూసిన గుణ ఏం చేశాడు..? లక్కీ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటాడా? వారిద్ద‌రి ప్ర‌యాణం ఎలా మొద‌లైంది? డ‌బ్బు సంపాదించాల‌న్న గుణ ఆశ తీరిందా, లేదా? ల‌క్కీకి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇదే టక్కర్ క‌థ‌.

విశ్లేషణ..

కెరీర్ మొదటినుండీ లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు హీరో సిద్దార్థ్. ఇక తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో ఒక్కసారిగా తెలుగులో తన సినీ కెరీర్ మారిపోయింది. ఆతరువాత తెలుగులోనే ఎక్కువగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఈమధ్యే మహా సముద్రం అంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు టక్కర్ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటివరకూ కాస్త సాప్ట్ క్యారెక్టర్స్ తో అలరించిన సిద్దార్థ్ ఈసినిమాలో తనలోని మాస్ యాంగిల్ ను చూపించాడు. డబ్బున్న అమ్మాయి, పేద అబ్బాయి, కిడ్నాప్ ఇలాంటి పాయింట్ తో ఇప్పటికే పలు సినిమాలు రావడం చూశాం. అయితే ఏ సినిమా అయినా ఎలా కొత్తగా చూపించాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక కార్తిక్ తీసుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. డబ్బు, జీవితం పట్ల వేర్వేరు ధృక్పదాలు, ఆలోచనలు కలిగి ఉండే. అమ్మాయి, అబ్బాయి కలిస్తే ఎలా ఉంటుంది.. వాళ్ల జర్నీ ఎలా ఉంటుంది అనే అంశంతో ఈసినిమా తీశాడు. అయితే దానికి కిడ్నాప్, థ్రిల్లర్ అంశాలను జోడించడం ప్లస్ పాయింట్ అయింది.

పెర్ఫామెన్స్

నటుడిగా సిద్దార్థ్ నటనకు వంక పెట్టేది ఏం ఉండదు. నటుడిగా తనెప్పుడో నిరూపించుకున్నాడు. ఈసినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. నిజానికి ఈసినిమాలో సిద్దార్థ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. డ‌బ్బు సంపాదించాల‌న్న త‌ప‌నను త‌న న‌ట‌నలో బాగా చూపించాడు. సిద్ధార్థ్ చేసే యాక్షన్ సీక్వెన్సులు.. కార్ ఛేజింగ్ సీన్లు బావున్నాయి. దివ్యాంశ కౌశిక్ తన అందంతో మరోసారి మెప్పించింది. తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. అభిమన్యు సింగ్‌ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సీరియస్ గా ఉంటూనే కామెడీ యాంగిల్ నవ్వుతెప్పిస్తుంది. యోగిబాబు తన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

టెక్నికల్ వాల్యూస్..

సాంకేతిక విభాగానికి వస్తే వాంజినాథ‌న్ మురుగేశ‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఇంకా పాటలు సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే సిద్దార్థ్ ను కొత్తగా చూడాలనుకునే వారు ఈసినిమాను చూడొచ్చు. అలానే థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారు ఈసినిమా చూడొచ్చు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =