ఇండస్ట్రీలో ఉన్న ఇంట్రెస్టింగ్ పెయిర్స్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ ది కూడా ఒకటని చెప్పొచ్చు. దాదాపు ఏడేళ్లు ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఏ రోజూ బహిరంగంగా ప్రేమలో ఉన్నామని చెప్పలేదు. ఫైనల్ గా గతఏడాది జూనే 9 వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకొని వివహాబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అయితే ఇరువురు వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా ట్విన్స్ కు తల్లిదండ్రులయ్యారు. ఇక రీసెంట్ గానే పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ అని పేర్లు పెట్టి ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరిద్దరి విహహం జరిగి నేటితో ఏడాది అయింది. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ తన ఇన్స్టా ద్వారా నయనతార ఇంకా ట్విన్స్ ఫొటోస్ ను పోస్ట్ చేశారు. ఇక పోస్ట్ లో నువ్వు నా జీవితంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది ఎన్నో క్షణాలతో నిండిపోయింది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. అనేక ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంటికి తిరిగొచ్చి నా అందమైన ఫ్యామిలీని చూస్తే.. కోల్పోయిన ఎనర్జీ మొత్తం తిరిగి వస్తుంది. ఫ్యామిలీ ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది. కలలు సాకారం చేసుకునే శక్తినిస్తుంది. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో పాటు నయన్ తన ఇద్దరి పిల్లల్ని ఎత్తుకుని ఉన్న క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
కాగా ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించిన నయనతార ఇప్పుడు లేడీ గా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక పక్క హీరోల పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ తో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: