పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అందులో ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఆదిపురుష్. మోస్ట్ అవైటెడ్ సినిమా అయిన ఆదిపురుష్ జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసినిమా భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా డేట్, వేదికను ఫిక్స్ చేశారు. జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆదిపురుష్ నుండి పాటలు ఒక్కోక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే జైశ్రీరామ్ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాట పెద్ద హిట్టయింది. ఇప్పుడు సెకెండ్ లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. రామ్ సియా రామ్ అనే సాంగ్ ను మే 29 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక ఈపాటను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: