తమిళ్ స్టార్ హీరో రజినీ కాంత్ ఈ వయసులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం రజినీకాంత్ అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క షూటింగ్ జరుకుంటూనే మరోపక్క ప్రమోకార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఇక తాజాాగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఫొటోల్లో డైరెక్టర్ తో పాటు రజనీకాంత్, తమన్నా కూడా ఉండగా ఇంకా చిత్రయూనిట్ మొత్తం ఉంది.
It’s a wrap for #Jailer! Theatre la sandhippom 😍💥#JailerFromAug10@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 pic.twitter.com/Vhejuww4fg
— Sun Pictures (@sunpictures) June 1, 2023
కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఆగష్ట్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: