విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గతంలో కన్నా మరింత విభిన్నంగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు తను రిలీజ్ కు సిద్దం చేస్తున్న సినిమా మరో డిఫరెంట్ మూవీ స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ స్పై సినిమా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అంతేకాదు ఈసినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాతో కూడా నిఖిల్ హిట్ ను కొడతాడన్న అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా తన 20వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. తాజాగ ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు స్వయంభు అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ నిఖిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. చూడబోతుంటే నిఖిల్ పీరియాడిక్ డ్రామాతో వస్తున్నట్టు అర్థమవుతుంది. వారియర్ గా ఈసినిమాలో కనిపించనున్నాడు. పోస్టర్‌లో నిఖిల్ యుద్ధభూమిలో పోరాట యోధుడిలా కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం, మరొక చేతిలో డాలుతో సరికొత్త అవతారంలో ఉన్నాడు. టైటిల్, లుక్ తోనే అప్పుడే సినిమాపై అంచనాలు పెంచేశాడు.
Our 20th Film will be #Swayambhu
🙏🏽 thanks for all the Love and Wishes on my Birthday… Will keep working harder and try to win ur hearts always 🙏🏽 @krishbharat20 @manojdft @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/d2fCgHmW3a— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2023
కాగా ఈసినిమాకు కృష్ణ భరత్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. విక్రమ్ చేసిన కోబ్రా సినిమాకు రైటర్ గా పనిచేశాడు కృష్ణ భరత్. ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: