లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జులై వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సిద్దార్థ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఇక తాజాగా ఈసినిమా గురించి సిద్దార్థ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇండియన్ 2 సినిమా ఇండియన్ సినిమాకు పదింతలు పవర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని తెలిపాడు. ఇంకా కమల్ హాసన్, శంకర్ లాంటి ఇద్దరు లెజెండరీస్ తో పనిచేయడం అదృష్టం అని.. ఇలాంటి అవకాశం లైఫ్ లో ఒక్కసారి మాత్రమే వస్తుందని తెలిపాడు. ఇక సిద్దార్థ్ చేసిన ఈవ్యాఖ్యల వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: