పవన్ OG రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

interesting buzz on pawan kalyans og movie release date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు ప్రస్తుతం పవన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో లేట్ గా సెట్స్ పైకి వచ్చిన బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసేశాడు పవన్ కళ్యాణ్. ఈసినిమాను జులైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితోపాటు ఈఏడాది మరో సినిమాను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు పవన్-సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా. ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈసినిమాా ను ఎట్టి పరిస్థితుల్లో ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు ఆ దిశగానే పవన్ కూడా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేస్తే పండగతో పాటు వీకెండ్ కూడా కలిసొస్తుందని మేకర్స్ ఆ దిశగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చూద్దాం మరి అన్నీ అనుకున్నట్టు జరిగి ఈసినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో?

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =