సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్–మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ఈసినిమా టైటిల్ ను అయితే రిలీజ్ చేశారు. ఈసినిమాకు గుంటూరు కారం అనే ఫుల్ మాసీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు మహేష్ బాబు కూడా ఈసినిమాలో అలానే కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమా అనగానే క్లాసీ టచ్ ఉంటుదేమో అని ముందునుండీ అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ గ్లింప్స్ తో ఎంత మాసీ అండ్ కమర్షియల్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. గత సినిమాలకు మించిన ఊర మాస్ అవతార్‌లో మహేష్ బాబు దర్శనమిచ్చారు. బీడీ కాల్చుతూ త్రీడీలో బీడీ కనబడతాందా అంటూ యాసలో మహేష్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఈ గ్లింప్స్ తో ఒక్కసారిగా సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఫ్యాన్స్ ఇంకా ఈ ఊపునుండి బయటకు రాకముందే.. మరో అప్ డేట్ తో వచ్చేశాడు నిర్మాత నాగవంశీ. గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ భారీ రెస్పాన్స్ అందించినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి థాంక్స్.. ఈసినిమాకు సంబంధించిన బిగ్ అప్ డేట్ ఆగష్ట్ 9న అందించనునట్లు తెలిపాడు. మరి ఆగష్ట్9 మహేష్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. చూద్దాం ఆరోజు ఎలాంటి క్రేజీ అప్ డేేట్ తో వస్తారో..
Super Fans, Your response in the Theatres is nothing short of a festival! 🤩
Our special thanks to one and all who came to theatres & unveiled our #GunturKaaram #MassStrike. Wait for the next big update on 9th August! ❤️
Keep the expectations high till then! 🔥…
— Naga Vamsi (@vamsi84) May 31, 2023
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: