పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. మొదట పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఒక్కసారిగా హైప్ ను క్రియేట్ చేశారు. ఇక ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆతరువాత పవన్, తేజ్ ఇద్దరూ ఉన్న పిక్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే పవన్ తన షూట్ ను పూర్తిచేసేశాడు. తేజ్ కూడా మళ్లీ రీసెంట్ గానే షూట్ లో పాల్గొని షూటింగ్ ను పూర్తిచేస్తున్నాడు. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు మేకర్స్. తాజాగా పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ అధికారికంగా తెలియచేస్తూ పలు ఫొటోలు కూడా షేర్ చేసింది.
Dubbing works for #BroTheAvatar commences with a Pooja Ceremony today 🥳
Worldwide Release on July 28th 💥@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @bkrsatish @neeta_lulla @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/UYCalAhaCT
— People Media Factory (@peoplemediafcy) May 30, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: