ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ హనుమాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈసినిమాలో 1600 VFX షాట్స్ ఉన్నట్లు తెలిపారు. అన్ని అనుకున్నట్లు గా జరిగితే ఈ జూన్ నెల చివరి వరకూ VFX పార్ట్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను జులై ఫస్ట్ వీక్ లో తెలిపే అవకాశం ఉందని అంటున్నారు ప్రశాంత్ వర్మ.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: