స్విట్జర్లాండ్ లో భోళా శంకరుడి చిరు ఆట పాట

chiru tweet about bhola shankar movie shooting in switzerland

గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో చిరు తన ట్విట్టర్ ద్వారా అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది.. ఈ పాట ప్రేక్షకులందరినీ, అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను.. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం.. అప్పటివరకూ ఈ చిరు లీక్స్ పిక్స్ అంటూ పోస్ట్ చేశాడు.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =