యాక్షన్ ప్యాక్డ్ ఫైనల్ షెడ్యూల్ లో గాండీవధారి అర్జున

Varun Tej Gandeevadhari Arjuna movie final schedule update

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుండేవాడు. ఒకే తరహా జోనర్‌కు పరిమితం కాకుండా ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తున్నాడు. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టింది చిత్రయూనిట్. దాదాపు చివరి దశకు చేరుకుంది కూడా. అంతేకాదు షూటింగ్ లో ఎక్కువభాగం అంతా యూకేలోనే జరిపారు. ఇక తాజాగా ఈసినిమా షూట్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది చిత్రయూనిట్. ఈనేథ్యంలో సెట్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ ఫైనల్ షెడ్యూల్ లో ఉన్నామని… హంగేర, బుడాపెస్ట్ లో వరుణ్ తేజ్ కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉన్నట్టు.. త్వరలో మరిన్ని అప్ డేట్స్ తో రానున్నట్టు తెలిపారు.

కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 1 =