మచ్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ మరో 29రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇటీవల విడుదలైన పోస్టర్లు,జై శ్రీరామ్ సాంగ్,ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి.విఎఫ్ఎక్స్ మీద వున్న అనుమానాలు కూడా ట్రైలర్ పటాపంచలు చేసింది.దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా క్వాలిటీ విషయంలో హ్యాపీ గా వున్నారు.ఈసినిమా 3డిలో కూడా విడుదలకానుంది.సినిమాకు వున్న హైప్ తో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ కానుంది ఆదిపురుష్ టీం.ఈసినిమా కు రన్ టైం 2గంటల54 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.ఈమధ్య కాలంలో ఇంత లాంగ్ రన్ టైం తో వస్తున్న సినిమా కూడా ఇదే కానుంది.త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కు వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ కూడా ఈశనివారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సీతగా కృతి సనన్,లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవదత్తా నాగే,రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.టి సిరీస్,రిట్రో ఫిలిమ్స్,యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా ఈఏడాది జూన్ 16న తెలుగుతోపాటు హిందీ,తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: