టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్ధార్థకు పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ప్రస్తుతం నిఖిల్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా కార్తికేయ2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కార్తికేయ3 కూడా చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా. కార్తికేయ2 ప్రమోషన్స్ అప్పుడే చందూ మొండేటి ఇంకా నిఖిల్ కూడా కార్తికేయ3 ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ‘కార్తికేయ 3’ చేయడానికి దర్శకుడు చందూ మొండేటి సన్నాహాలు చేసుకుంటున్నట్టు.. కథను కూడా సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది
ఇక ఇదిలా ఉండగా దీనితో పాటు మరో సాలిడ్ ప్రాజెక్ట్ ను నిఖిల్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. సుధీర్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నిఖిల్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే స్వామిరారా సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి జతకట్టనున్నారు. రీసెంట్ గానే సుధీర్ వర్మ ఓ కథని నరేట్ చేయగా నిఖిల్ కి అయితే ఈ కథ నచ్చిందని తెలుస్తుంది. దీనితో వెంటనే ఓకే చేసాడట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: