ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలోనే పూరీ జగన్నాథ్ ఇంకా రామ్ పోతినేనిది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ 2 వస్తుందంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈవిషయంలో క్లారిటీ ఇచ్చేశారు. నాలుగేళ్ల తర్వతా వీరద్దరి కాంబినేషన్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తూ క్రేజీ వీడియో తో అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ కాంబినేషన్ పై రేపు అంటే మే 14న ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓ స్ట్రైకింగ్ అప్డేట్ తో మరింత క్లారిటీ ఇవ్వనున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్టే ఇస్మార్ట్ శంకర్ 2 గురించి అప్ డేట్ ఉంటుందా లేక వేరే ఏదైనా ఉంటుందా అనేది చూడాలి.
The combo that gave Ismart Blockbuster🔥
After 4 years, Ustaad @ramsayz & Sensational Director #PuriJagannadh join forces again❤️🔥
Produced by PuriJagannadh & @Charmmeofficial in @PuriConnects
A Dhimak Kharab Announcement Striking Tomorrow at 4PM 💥
Stay HYPED 🔱 pic.twitter.com/8CLJrNkx4Y
— Puri Connects (@PuriConnects) May 13, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: