బోయపాటి రామ్ మూవీ అప్డేట్ 

BoyaptiRapo movie update

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా చివరి దశ షూటింగ్ లో వుంది.ఇక ఈసినిమా నుండి రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న ఉదయం 11:25గంటలకు ఫస్ట్ థండర్ అనే పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఈసినిమాలోని రామ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్,జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.ఈసినిమా దసరా బరిలో నిలువనుంది.అక్టోబర్ 20న తెలుగుతోపాటు హిందీ,తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది.రామ్ కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా.మరి ఈసినిమా రామ్ కు ఎలాంటి ఫలితాన్నిఇస్తుందో చూడాలి.

ఇక ఈసినిమా తరువాత రామ్,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మరో సారి నటించనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.ఇప్పుడు చేయబోయే సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఆ కాదా అనేది రేపు క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 13 =