డిఫరెంట్ కథతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. తేజసజ్జా హీరోగా న దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే బాంబిరెడ్డి అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి. అందులోనూ ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో వస్తుండటంతో ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు నెక్ట్స్ లెవల్ వెళ్లాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమాకు రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈసినిమాకు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మెయిన్ కావడంతో దానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుండటంతో రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా దానికి కారణం ఏంటో ప్రశాంత్ వర్మ తెలియచేశాడు. మొదట ఈసినిమాను అనుకున్నప్పుడు పాన్ ఇండియా సహా ఇండియాలో ఇతర భాషల్లో కూడా రిలీజ్ కావాలని కోరుకున్నాాము.. అయితే ఆ తర్వాత చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల నుంచి కూడా నిర్మాతకి కాల్స్ వచ్చాయని దీనితో హను మాన్ లాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ని తాము పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామని తెలిపాడు. మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: