నటీనటులు :నాగచైతన్య,కృతి శెట్టి, అరవింద్ స్వామి,శరత్ కుమార్
సంగీతం : ఇళయరాజా,యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్ : వెంకట్ రాజేన్
సినిమాటోగ్రఫీ :కథిర్
దర్శకత్వం :వెంకట్ ప్రభు
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్,ట్రైలర్ తో మంచి బజ్ ను క్రియేట్ చేసిన చిత్రం కస్టడీ.యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య,కృతి శెట్టి జంటగా నటించిన ఈచిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశాడు.కంటెంట్ మీద వున్న నమ్మకంతో నాగ చైతన్య సినిమాను చాలా ప్రమోట్ చేశాడు.ఇక ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
1996 మోరంపూడిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తో సినిమా ప్రారంభం అవుతుంది.ఈబ్లాస్ట్ లో 40మంది చనిపోతారు.ఈకేసును సిబిఐకి అప్పగిస్తారు. ఆతరువాత కానిస్టేబుల్ గా ఎంట్రీ ఇస్తాడు శివ (నాగ చైతన్య). సిన్సియర్ కానిస్టేబుల్ అయిన శివ,రేవతి (కృతి శెట్టి )తో ప్రేమలో పడతాడు.ఇద్దరు ప్రేమ,పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.మరోవైపు క్రిమినల్ రాజుని ( అరవింద్ స్వామి) చంపడానికి మరో గ్యాంగ్ ట్రై చేస్తుంది.అయితే శివ,రాజుని ప్రాణాలతో కాపాడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.ఇంతకీ శివ,రాజును ఎందుకు రక్షించాలనుకుంటాడు.అలాగే నిజాన్ని కాపాడాలనే ప్రయత్నంలో శివ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
గ్యాంబ్లర్,మానాడుతో ఫేమ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు.ఈరెండు సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది.ఈసారి కూడా అదే ఫాలో అయిపోయి కస్టడీని కూడా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే తో తెర మీదకు తీసుకొచ్చాడు.సింపుల్ స్టోరీని స్క్రీన్ ప్లే,ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ గా మార్చి సినిమాను అనుకున్న విధంగా తీర్చిదిద్దాడు.మొదటి 30నిమిషాలు కొంచెం స్లో గా సాగినా ఫీలింగ్ వచ్చినా ఆతరువాత పవర్ ఫుల్ పాత్రల ఎంట్రీ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.ముఖ్యంగా ప్రీ ఇంటర్వల్, ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అయ్యాయి.అదే స్పీడ్ లో సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ గా ఉండడం తో సినిమా శాటిస్ఫై చేసింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్,సినిమాటోగ్రఫీ కూడా సినిమా కు చాలా ప్లస్ అయ్యాయి.
నటీనటుల విషయానికి వస్తే శివ పాత్రకు నాగ చైతన్య బాగా సూట్ అయ్యాడు.తన సిన్సియర్ పెర్ఫామెన్స్ తో పాత్ర ను ఆసక్తిగా మార్చడు.శివ పాత్ర నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ గా చెప్పొచ్చు.ఇక ఈసినిమాలో శివ పాత్ర తరువాత హైలెట్ అయిన క్యారెక్టర్ రాజు.ఈపాత్రలో నటించిన అరవింద్ స్వామి తన నటనతో మెప్పించాడు.ధ్రువ లో విలన్ పాత్రలో ఆకట్టుకున్నా అరవింద్ స్వామి కస్టడీ లో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసాడు.ఈసినిమాలోకూడా విలన్ పాత్రలో కనిపించగా..ఈపాత్రను చాలా బాగా డిజైన్ చేశాడు వెంకట్ ప్రభు.
ఇక రేవతి పాత్రలో కృతి శెట్టి ఓకే.స్క్రీన్ మీద చాలా గ్లామర్ గా కనబడింది.సీఎం పాత్రలో ప్రియమణి హుందాగా కనిపించింది.స్క్రీన్ మీద కనిపించింది కాసేపయినా ఇంపాక్ట్ చూపించింది అలాగే మిగితా పాత్రల్లో నటించిన సంపత్ రాజ్,శరత్ కుమార్ పాత్రలకు న్యాయం చేసారు.ఇవే గాక సినిమాలో సప్రైజింగ్ గెస్ట్ రోల్స్ కూడా వున్నాయి.
ఇక సినిమాకు టెక్నీకల్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించింది.యువన్ శంకర్ రాజా బీజీఎమ్ చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది అలాగే కథిర్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.చాలా రియలిస్టిక్ గా చూపించాడు.సుమేర్ వర్మ అండర్ వాటర్ సీక్వెన్స్ అద్భుతంగా చూపించాడు.ఎడిటింగ్ ఓకే.శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కస్టడీలో నాగ చైతన్య నటన,విలన్ రోల్, ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్ సీన్స్,బీజీఎమ్,సినిమాటోగ్రఫీ హైలెట్ అయ్యాయి.థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి ఈసినిమా నచ్చుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.