టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ2, 18 పేజెస్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కు సిద్దమవుతున్నాడు. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ స్పై సినిమా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను ముంగిచుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను జూన్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించార. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్డేడ్ ఇచ్చారు. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ఇంకా వేదికను కూడా ఖరారు చేశారు. ఈనేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన వివరాలు తెలియచేసింది చిత్రబృందం. టీజర్ మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు హిస్టారిక్ ప్లేస్ లో ఈ టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు. మే 15న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్, నేతాజీ స్టాచ్యూ దగ్గర టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ జీవితం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఆయన విగ్రహం వద్దే నిర్వహించబోతున్నారు.
It’s an Honour to be able to Launch #SPY Movie teaser from NETAJI Statue at Kartavya Path (RajPath) New Delhi🔥this 15th May 🙏🏽
Brace yourselves for the FIRST-EVER movie teaser launch at the iconic landmark💥 #SubhasChandraBose#IndiasBestKeptSecret 🇮🇳 #SpyonJune29th… pic.twitter.com/Z8LW1HmBHA
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 12, 2023
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: