ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు కూడా సినిమాను ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ పై షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు తమ ట్విట్టర్ ద్వారా.. హనుమాన్ టీజర్ పై మీరు చూపించిన ప్రేమ మా మనసులను తాకింది.. అంతేకాదు ఆ రెస్పాన్స్ వల్ల మంచి అవుట్ పుట్ ఇవ్వాలన్న బాధ్యత కూడా పెరిగింది.. మంచి అనుభూతినిచ్చే సినిమా ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము.. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నాము.. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: