జైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

jailer movie release date fixed

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్‌, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.