పవర్ స్టార్ మాత్రం ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు ప్రాజెక్ట్ ఉండగా అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తో వస్తుంది. టైటిల్ కు తగ్గట్టే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రీసెంట్ గానే అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అప్పుడే మరో షెడ్యూల్ ను ప్రారంభించేశారు. పూణేలో ఓజీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు చిత్రనిర్మాణ సంస్థ తెలిపింది. ఈషెడ్యూల్ లో పవన్ ఇంకా హీరోయిన్ ప్రియాంక అరుళ్ కూడా పాల్గొంటున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Pune… You have our heart.💚
Lush green landscapes…
Beautiful @priyankaamohan…
and the almighty @PAWANKALYAN.
New schedule begins today. #TheyCallHimOG #OG— DVV Entertainment (@DVVMovies) May 3, 2023
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: