గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హిట్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందో లేదో ఎడిటింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు కొత్తు షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఈసినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది చిత్రయూనిట్. ఈమేరకు హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఆవిషయాన్ని తెలియచేస్తూ పలు ఫొటోలు కూడా షేర్ చేశాడు.హరీష్ శంకర్, ఆనంద్‌సాయి తోపాటు మరో టీం మెంబర్ ఉన్నాడు. ముగ్గురూ కలిసి ఓ చెరువు పక్కన గ్రీనరీలో చర్చిస్తున్నట్టు ఉంది. ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తిగా యాక్షన్ మోడ్ లో ఉంటుందని తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ వర్క్ కూడా మొదలైన విషయం తెలిసిందే.
Team #UstaadBhagatSingh is gearing up for the next schedule 💥💥
It is going to be an action packed one 🔥🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/WRJSeMEbh1
— Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2023
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: