ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. తెలుగు తో పాటు కన్నడ లో కూడా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రమోషన్స్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టీజర్ లో కొన్ని సన్నివేశాలు అల్లరి నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసినట్టు అర్థమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపారు. అయితే ఇప్పుడు డేట్ ను ప్రకించారు. ఈసినిమాను మే 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈసినిమాలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: