ఫ్యామిలీ సినిమా రావడం లేదనే లోటు రామబాణం తీరుస్తుంది

director sriwass about rama banam movie

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీవాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘రామబాణం’ ట్రైలర్ చూస్తుంటే మీ స్టయిల్ లో మాస్ స్టైలిష్ యాక్షన్ కనిపిస్తోంది. ఇప్పటి ప్రేక్షకుల ట్రెండ్ కి తగ్గ కొత్త అంశాలు ఇందులో ఎలా వుండబోతున్నాయా?

గోపీచంద్ గారు నేను కలసి మళ్ళీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఒక మంచి యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నాను. అయితే ‘’లక్ష్యం, లౌక్యం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ క్లాస్ అందరూ లైక్ చేసిన కథలు. మళ్ళీ కలసి చేస్తున్నపుడు మన నుంచి ప్రేక్షకులు అలాంటి సినిమా కోరుకుంటారు” అని గోపీచంద్ గారు నేను భావించాం. ఆయనకి వుండే యాక్షన్, ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరేలా అదే సమయంలో మంచి ఉద్దేశం వున్న కథ చేయాలని అనుకున్నాం. అన్నదమ్ముల అనుబంధం మీద ఓ కొత్త పాయింట్ దొరికితే దాన్ని అన్నీ ఎమోషన్స్ ఎలిమెంట్స్ వున్న కథ చేయడం జరిగింది.

ఈ సినిమాకి మొదట లక్ష్యం 2 అనే టైటిల్ ని అనుకున్నారట.. బాలకృష్ణ గారు రామబాణం టైటిల్ ని సూచించారని విన్నాం.?

గోపీచంద్, జగపతి బాబు గారు మళ్ళీ కలసి చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు లక్ష్యం 2 అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అయితే ఆ సినిమా వచ్చి చాలా ఏళ్ళు గడిచింది. మళ్ళీ ఆ కథకు సీక్వెల్ అనుకునే ఛాన్స్ వుంది కాబట్టి ప్రత్యామ్నాయం చూశాం.

ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా.. దాని మూలాల్లోకి వెళ్ళారా ?

ఆర్గానిక్ ఫుడ్ పాయింట్ ని కథకు ఎంత అవసరమో అంత వాడాం. ఏ కథ చేయాలన్నా కాన్ ఫ్లిక్ట్ కావాలి. కాన్ ఫ్లిక్ట్ గురించి అలోచించినపుడు.. కరోనా తర్వాత జనాల్లో ఫుడ్ పై అవగాన పెరిగింది. దాని రిలేట్ గా పెడితే ఇంకా కనెక్టింగ్ గా వుంటుందనిపించింది. ఆర్గానిక్ ఫుడ్ పెద్ద సబ్జెక్ట్. ఈ సినిమా కథకు ఎంత కావాలో అంతవరకు చెప్పాం.

ప్రేక్షకుల అభిరుచి మారిందనే అభిప్రాయం వ్యక్తమౌతున్న సమయం లో రామబాణం లాంటి కథలు చేయడం రిస్క్ అనిపించిందా ?

హారర్, డార్క్, రగ్గడ్ సినిమాలు విడుదలై విజయం సాధిస్తే అందరూ అవే సినిమాలు చూస్తారని అనుకుంటాం గానీ.. నాకున్న అనుభవం అవగాహన ప్రకారం..కుటుంబం అంతా కలసి వెళ్లి చూడడానికి ఒక మంచి సినిమా కావాలి. అందరూ కూర్చుని హ్యాపీగా చూసే సినిమా అవసరం. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా రావడం లేదనే వెలితి ఎప్పుడూ వుంటుంది. ఆ వెలితిని రామబాణం భర్తీ చేస్తుంది.

మీరు ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ వున్న చిత్రాలు చేస్తారు కదా..ఇది మీ సేఫ్ జోన్ అని భావిస్తారా?

ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అంత తేలిక కాదండీ. అది సేఫ్ జోనర్ కూడా కాదు. హారర్. థ్రిల్లర్స్,యాక్షన్ ..కొరియన్, ఇంగ్లీష్ చిత్రాలు చూసి ప్రేరణ పొందే అవకాశం వుంది. కానీ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ అలా కాదు. కథ పాత్రలు మన జీవితం నుంచి రావాలి. మనం నిత్యం చూసే పాత్రలోనే కొత్తదనం చూపించడం అంత తేలిక కాదు. నేను ఇలాంటి తరహా సినిమాలు చేయడానికి నేను వచ్చిన నేపధ్యం కారణం కావచ్చు. అలాగే ఇలాంటి చిత్రాలలో నాకు ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే దర్శకుడిగా అన్ని రకాల చిత్రాలు చేయడానికి సిద్ధం.

కుష్బూ గారి స్టార్ డమ్ ఈ పాత్రకు ఎంతహెల్ప్ అయ్యింది ?

కుష్బూ గారి పాత్ర ఈ చిత్రానికి ఒక మెయిన్ పిల్లర్. జగపతి బాబు గారి భార్య పాత్రో ఎంత హుందా కనిపిస్తుందో అదే సమయంలో గోపీచంద్ వదినగా కూడా అంత గొప్పగా కనిపిస్తుంది. గోపీచంద్, కుష్బూ గారి మధ్య వచ్చే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమా తర్వాత కుష్బూ గారి నుంచి మరిన్ని పాత్రలు వస్తాయి.

గోపీచంద్ గారి తో రెండు సినిమాలు చేశారు కదా. ఆ అనుబంధం రామబాణంలో ఎంత హెల్ప్ అయ్యింది ?

గోపీచంద్ గారి బాడీ లాంజ్వేజ్ పై ముందే ఒక అవగాహన వుంది. ఆయనకి ఎలాంటి సీన్స్ నప్పుతాయనేది స్క్రిప్ట్ లెవల్ లోనే ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత వర్క్ చేయడం చాలా తేలికగా వుంటుంది.

సొంత కథ, బయట కథ.. ఈ రెండితో ఏది చేయడానికి ఇష్టపడతారు?

నేను రెండూ చేయగలను. దాసరి గారిలా సొంతగా కథ రాసుకొని డైరెక్ట్ చేయగలను. అలాగే రాఘవేంద్రరావు గారిలా ఎవరైనా మంచి పాయింట్ చెబితే దాన్ని స్క్రిప్ట్ గా మలచుకోగలను. అయితే.. రెడీ మేడ్ గా వున్న మంచి కథలని ఎంచుకొని దర్శకత్వంపై ఎక్కువ ద్రుష్టి పెట్టాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలు ఉన్నాయా ?

మనం చేసే సినిమా పాన్ ఇండియా వెళ్ళాలి కానీ.. పాన్ ఇండియా సినిమా అనుకోని చేస్తే కుదరదని నా అభిప్రాయం.

ఏదైనా ఒక ఎలిమెంట్ వున్న సినిమాలు చేయడం కష్టమా.. లేదా రామబాణం లాంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లు కష్టమా ?

యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటే యాక్షన్ పై ద్రుష్టి పెడితే సరిపోతుంది. కానీ రామబాణం లాంటి సినిమా అంత ఈజీ కాదు. మూడు నాలుగు సినిమాలకు పడిన శ్రమ ఈ ఒక్క సినిమాకి పడ్డాం. ఇందులో ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయి. సోషల్ అవేర్నెస్ వుంది. ఇందులో ఏ ఒక్క పాయింట్ చేసినా అదొక సినిమా అవుతుంది. కానీ ఇవన్నీ ఒక సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని. కమర్షియల్ సినిమాకి ఇంత పెద్ద స్పాన్ ఉండటానికి కారణం ఇదే. ప్రేక్షకులు ఒక్కసారి కమర్షియల్ సినిమాలోకి ఎంటర్ అయితే షాపింగ్ మాల్ కి ఎంటరైనట్లే. ఎవరికి నచ్చింది వారు తీసుకుంటారు.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి?

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ రామబాణం కు కొత్త లుక్ ఇచ్చింది. నేపధ్య సంగీతం కూడా చాలా రిచ్ గా కొత్తగా చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల గురించి ?

రామబాణం లాంటి సినిమాలు గ్రాండ్ స్కేల్ చేయాలని అనుకున్నపుడు కథని అర్ధం చేసుకొనిఅన్నీ సమకూర్చే నిర్మాతలు కావాలి. రామబాణం సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. రామబాణం చూస్తున్నపుడు ప్రేక్షకుల కి ఫుల్ మీల్స్ లా వుంటుంది. ఈ సమ్మర్ కి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.