అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ అంచనాల మధ్య గత నెల 28న విడుదలైయింది.ఇక ఇప్పుడు కేవలం 21రోజుల వ్యవధిలోనే ఈసినిమా ఓటిటి లోకి రానుంది.ప్రముఖ ఓటిటి సోనీ లివ్,ఏజెంట్ ను మే 19నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు మలయాళ భాషల్లో విడుదలైన ఈసినిమా ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు.హిప్ హప్ తమిళ సంగీతం అందించాడు.మలయాళ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్,మమ్ముట్టి నటన,యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అయ్యాయి.ఈసినిమా తరువాత అఖిల్ తాను నటించబోయే సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు అయితే అఖిల్ ఈసారి కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది.త్వరలోనే ఈవిషయంలో క్లారిటీ రానుంది.
ఇక అఖిల్ తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈసినిమా తరువాత హలో,మిస్టర్ మజ్ను,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్,ఏజెంట్ సినిమాల్లో నటించాడు అయితే వీటిలో ఏ ఒక్కటీ కూడా బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని దక్కించుకోలేకపోయాయి.మరి ఇప్పుడు చేయబోయే సినిమాతోనైనా అఖిల్ కోరిక తీరుతుందేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: