పాన్ ఇండిాయ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఓం రౌత్ దర్శకత్ంలో వస్తున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా గ్రాఫిక్స్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో చిత్రయూనిట్ ఆ విషయంలో మరింత కేర్ తీసుకుంటుంది. దీనికోసం రిలీజ్ ను వాయిదా వేసుకుంది. ప్రస్తుతం ఆపనుల్లో బిజీగా ఉన్నా మధ్య మధ్యలో అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవలే జైశ్రీరామ్ అంటూ సాగే పాట లిరికల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మేకర్స్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ మోషన్ పోస్టర్ తేజరిని విడుదల చేశారు. ఇక దీనికి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఈ మోషన్ పోస్టర్ లో కృతి సనన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు అజయ్ అతుల్ మ్యూజిక్ కూడా బాగుంది.
सीता राम चरित अति पावन
The righteous saga of Siya Ram
Jai Siya Ram
जय सिया राम
జై సీతారాం
ஜெய் சீதா ராம்
ಜೈ ಸೀತಾ ರಾಮ್
ജയ് സീതാ റാം#Adipurush #SitaNavmi #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi #KrishanKumar @vfxwaala @rajeshnair06 pic.twitter.com/e3iUXKsuxh— UV Creations (@UV_Creations) April 29, 2023
కాగా ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూన్ 16వ తేదీన ఈసినిమా 3డీ 4డీ వెర్షన్ లలో పలు భాషలలో విడుదల కాబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: