విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే బ్రైయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇండియాలో ఉన్న ధనవంతుల్లో ఒకడైన విజయ్ గురమూర్తిని పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. అయితే అతను హత్యకు గరవుతాడు. ట్విస్ట్ ఏంటంటే విజయ్ గురుమూర్తిలా ఉండే సత్య అనే వ్యక్తి ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు అవుతాడు. మొత్తానికి థ్రిల్లింగ్, యాక్షన్, గ్రాండ్ విజువల్స్ తో కూడిన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఇచ్చాడు విజయ్ ఆంటోని. ట్రైలర్ చూస్తుంటే బిచ్చగాడు 2తో విజయ్ మరోసారి తన మార్క్ చూపించేటట్లు కనిపిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: