సాయి ధరమ్ తేజ నటించిన విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.నిన్న ఏజెంట్,పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయినా కూడా విరూపాక్ష స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో 8వరోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.5కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఎనిమిది రోజుల్లో మొత్తం 65కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.వీకెండ్ కావడంతో ఈరోజు,రేపు కూడా మంచి వసూళ్లను రాబట్టనుంది.ఈరోజు తో ఈసినిమా, ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ ను క్రాస్ చేసి సాయి ధరమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Box-office bull run of #Virupaksha continues on the 2nd Week grossing 65CR+ 💥🎉#BlockbusterVirupaksha IN YOUR NEAREST THEATRES 👇https://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/SjwvMlRXUe
— SVCC (@SVCCofficial) April 29, 2023
ఇక ఈసినిమా హిందీ, తమిళ,మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది. ఈమూడు భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి.అందులో భాగంగా హిందీలో గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ రిలీజ్ చేస్తుండగా తమిళ్ లో కెఇ జ్ఞానవేల్ రాజా సొంత ప్రొడక్షన్ స్టూడియో గ్రీన్ మలయాళంలో ఇ4ఎంటర్టైన్మెంట్స్ విడుదలచేస్తున్నాయి.తమిళ వెర్షన్ మే5న విడుదలకానుంది.
మరి తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన ఈసినిమా మిగితా భాషల్లో ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: