ప్రస్తుతం సునీల్ అటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే మరోపక్క హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. యలమంద చరణ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా భువన విజయమ్ అనే సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీసినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మే 12వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా పృథ్విరాజ్, గోపరాజు రమణ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనురాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్‌కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సాయి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: