ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అవ్వగా అన్నీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గానే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ నేటితో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలనుపెట్టి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
And… It’s a Wrap for Team #HANUMAN 💥
The much-awaited Indian Superhero Film completes its shoot👊
Coming soon to spellbound you all in theaters Worldwide❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy pic.twitter.com/vkSX0ON07Z— Primeshow Entertainment (@Primeshowtweets) April 17, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: