చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా తండేల్. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథే ఈసినిమా. ఇందులో నాగచైతన్య ఓ జాలరి పాత్రలో కనిపించబోతుండగా, పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు సాయి పల్లవి పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్బంగా స్పెషల్ వీడియో రానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక చెప్పినట్టే తాజాగా సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సాయిపల్లవి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సాయి పల్లవి గురించి ప్రశంసిస్తూ తన పర్ఫార్మెన్స్ లతో, షూటింగ్ సెట్స్ లో తను చేసి అల్లరిని ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
You act. We celebrate.
You perform. We cherish.Happy Birthday ‘Bujji Thalli’ aka @Sai_Pallavi92 👑🫰🏻
On your special day here’s a special gift from team #Thandel ⚓▶️ https://t.co/ZmSoNdDTek#HBDSaiPallavi ❤
Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP pic.twitter.com/Hy1dWaCQD5
— Geetha Arts (@GeethaArts) May 9, 2024
కాగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: