ఉస్తాద్ టీజర్ రిలీజ్

sri simha ustaad movie teaser out

యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో బాలనటుడిగా నటించి.. మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. అంతేకాదు నటన పరంగా కూడా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తెల్లవారితే గురువారం, ఇంకా దొంగలున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు చేశాడు కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. ఫణదీప్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా చేతుల మీదుగా టీజర్ చేశారు. టీజర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన ఆకట్టుకుంటుంది. ఎత్తులంటే చిన్నప్పటి నుండి భయపడే ఓ కుర్రాడు ఫైలెట్ ఎలా అయ్యాడు అనేది ఈసినిమా కథ అని అర్థమవుతుంది. పెద్దయ్యాక హీరో పైలెట్ అవ్వాలనుకుంటాడు.. కానీ అతనికి పై నుండి చూడాలన్నా.. ఎత్తులంటే చాలా భయం. అలాంటి ఫోబియా నుండి బయటకు వచ్చి.. తనకున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి చివరికి తన కలను ఎలా నిజం చేసుకున్నాడు అన్నది కథ. అంతేకాదు బైక్ నడిపే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆసమయంలో తను నేర్చుకున్న మెళకులు పైలెట్ గా మారిన తర్వాత కూడా అతడికి ఎలా ఉపయోగపడతాయో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా ఈసినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. మసూద, బలగం సినిమాలతో ప్రస్తుతం కావ్య కూడా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.