శ్రీలీల అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ 

Sensational Actress Sreeleela Lines Up Massive Projects

తెలుగులో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఈసినిమాలో తన యాక్టింగ్,డ్యాన్స్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.పెళ్ళిసందడి కమర్షియల్ గా కూడా సక్సెస్ కావడంతో శ్రీలీల కలిసొచ్చింది.ఈసినిమా తరువాత రవితేజ నటించిన ధమాకాలో,శ్రీ లీల,హీరోయిన్ గా చేసింది.ఈసినిమాతో శ్రీలీల ఫేట్ మారిపోయింది.ఇందులో కూడా తను చేసిన డ్యాన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇక్కడ నుండి వరుస గా ఆఫర్లు క్యూ కట్టాయి.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలకు సైన్ చేసి మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆఎనిమిది సినిమాలు ఏంటంటే… సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల.త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల ఇటీవలే ఈసినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ షూటింగ్ పూర్తి చేసింది.మహేష్,శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ కానున్నాయట.

ఈసినిమాతో పాటు అనిల్ రావిపూడి,బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్ బి కె 108 లో శ్రీలీల స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఇందులో కాజల్ హీరోయిన్.రీసెంట్ గా శ్రీలీల ఈసినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది.

అలాగే హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా ఓ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.నిన్ననే శ్రీలీల ఈసినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

స్టార్ హీరోల తోపాటు యువ హీరోల సినిమాలకు కూడా సైన్ చేసింది శ్రీలీల.అందులో భాగంగా నితిన్ నటిస్తున్న 32వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వక్కంతం వంశీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తుండగా హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈసినిమాతో పాటు పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నతన 4వ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

అలాగే బోయపాటి శ్రీనివాస్,రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

వీటితోపాటు నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగ ఒక రోజు అలాగే వారాహి క్రీయేషన్స్ నిర్మిస్తున్న జూనియర్ అనే సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఒకేసారి ఇన్ని ఆఫర్లు ఏ హీరోయిన్ కి రాలేదని చేప్పాలి.మొత్తానికి ఏకంగా 8సినిమాలను లైన్లో పెట్టి శ్రీలీల కొత్త రికార్డు సృష్టించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.